¡Sorpréndeme!

కాలిబూడిదైన ‘సైరా నరసింహారెడ్డి’ సెట్! || Filmibeat Telugu

2019-05-03 965 Dailymotion

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి' మూవీ సెట్లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుఝామున జరిగిన ఈ ఘటనలో సెట్ మొత్తం కాలి బూడిదైంది. అదృష్ట వశాత్తూ అక్కడ ఎవరూ లేక పోవడంతో ఎవరికీ ఎలాంటి హాని కలుగలేదు. మెగాస్టార్ చిరంజీవికి చెందిన ఫాం హౌస్‌లో ఈ సెట్ వేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట శివారులో ఇది ఉంది. తెల్లవారు ఝామున దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు.
#Chiranjeevi
#ramcharan
#nayanatara
#amitabhbachchan
#vijaysethupathi
#maheshbabu
#rajinikanth
#tollywood